బతికున్న పామును మింగేసిన వ్యక్తి.. నాలుక పై కాటేసిన పాము..ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

-

కొన్ని సంప్రదాయలను చూస్తుంచే వింతగా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఇంకా ఈ జెనరేషన్ వాళ్లకైతే..ఇదెక్కడి ఆచరంరా బాబు అనిపిస్తుంది. రష్యాలోని ఒక ప్రాంతంలో బతికున్న పామును తినటం ఒక సంప్రదాయమట..అలానే తిన్న ఒక వ్యక్తికి ఇప్పుడు ఏమైందో మీరే చూడండి.
snake
బేసిక్ గా అందరికి పాము అంటేనే భయం. దాన్ని ముట్టుకోవటం కాదు కదా..చూస్తే సగం ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. చచ్చిన పాముని చూడ్డానికి కొందరు ఇష్టపడరు భయమేసి..అలాంటి ఏకంగా బతికున్న పామునే తినేశాడు ఆ వ్యక్తి.

నాలుక, గొంతులోపలి భాగంలో కాటేసిన పాము

రష్యా ఆస్ట్రాఖాన్ కు చెందిన 55 ఏళ్ల వ్యవసాయ కూలీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డైలీ స్టార్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి పామును మింగటానికి రెండు సార్లు ప్రయత్నించాడు. అవ్వలేదు.. కానీ మూడవ సారి ప్రయత్నిస్తుండగా.. అతడి నాలుకను పాము కాటు వేసింది. అప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆగకుండా పామును మింగటానికి ప్రయత్నించగా, పాము గొంతు లోపల భాగంలో కూడా మరోసారి కాటువేసింది.

దెబ్బతిన్న ఆరోగ్య

పాముకాటు తరువాత కొన్ని గంటల్లో అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించటం మొదలైంది. ఆసుపత్రిలో చేర్చగా…ఆ వ్యక్తికి అలర్జీ సోకిందని డాక్టర్లు తెలిపారు. పాము కాటు కారణంగా నాలుక మరియు గొంతు తీవ్రమైన వాపుకు గురయ్యాయి. ఆ వ్యక్తి  అనాఫిలాక్టిక్ షాక్‌కు (Anaphylactic Shock) గురయ్యాడని వైద్యులు పేర్కొన్నారు..అంటే  శరీరంలో ప్రవేశించిన యాంటిజెన్‌కు కారణంగా బాడీ హైపర్సెన్సిటివ్‌గా మారి, ప్రాణాంతకర అలెర్జీ గా మారటాన్ని అనాఫిలాక్టిక్ షాక్‌ అంటారు. ఫలితంగా వ్యక్తి నాలుక విపరీతంగా ఉబ్బటం కారణంగా శ్వాసలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మరణించాడని వైద్యులు తెలిపారు.

పాములు మింగటం ఆక్కడి ఆచారం

ఈ ప్రాంత ప్రజలకు పాములను మింగే సాంప్రదాయ అలవాటు ఉందట. పుచ్చకాయ పొలాలలో స్టెప్ వైపర్ అనే పాము ఆ వ్యక్తికి కనబడింది. ఆ పాము చెప్పుకోదగ్గంత విషపూర్తితం కాదు..అయినప్పటికీ పామే కదా..మానవులకు ప్రమాదమే. ఈ సంఘటన జరిగినప్పటి నుండి అక్కడి పాలకులు ఈ పాములను మింగే ఆచారాన్ని ఆపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news