దేవుడా..! కోటీశ్వరులు అంటే బిందాస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. లగ్జరీ గా బతుకుతారు అని మాత్రమే తెలుసు. కానీ ఈమె పిసినారితనం మాత్రం పీక్స్. అమెరికాకు చెందిన ఈ మహిళా మిలీనియర్ గురించి చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. కోటీశ్వరులంటే.. ఓ లెవల్‌లో ఉంటారని మనం అనుకుంటాం. ఖరీదైన బంగ్లాలు, కార్లతో విలాసవంతంగా జీవిస్తారని, నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారని అనుకుంటాం. అయితే, ఈ కోటీశ్వరురాలు గురించి తెలుసుకుంటే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది.
కోట్లు సంపాదిస్తున్నా.. ఇంకా అంత కక్కుర్తి ఎందుకని ఆశ్చర్యపోతారు. వివరాల లోకి వెళితే…ఐమీ ఎలిజబెత్ అనే ఈమె కోటీశ్వరురాలు. ఈమెకి 50 ఏళ్లు. ఈమె ఆదాయం 5.3 మిలియన్లు (రూ.38.71 కోట్లు). కానీ ఈమె తినేది క్యాట్ ఫుడ్. తన ఇంటికి వచ్చే అతిథులకు సైతం అదే పిసినారి అంటే మామూలు పిసినారి కాదు పరమ పిసినారి. ఆహారం గురించి ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పిల్లికి పెట్టే ఆహారాన్ని మాత్రమే తింటోంది.
ఈమె తన ఖర్చుల కోసం కేవలం వెయ్యి డాలర్లు (రూ.73 వేలు) మాత్రమే ఉంచుకుంటుంది. వాటర్ హీటర్‌ను కేవలం 22 నిమిషాలు మాత్రమే ఆన్‌లో ఉంచుతుందట. నీటిని వేడి చేసి కరెంట్‌ను, సమయాన్ని వృథా చేయడం ఇష్ట ఉండదట ఈమెకి. ఇలా చెయ్యడం వలన ఐదు వేల వరకు ఆదా చేస్తుంది. ఇక ఈమె ఉంటున్న ఇల్లు మాజీ భర్త మైఖెల్ ఇచ్చారట. ఆ ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రం చేసే బాధ్యతను అతడు తీసుకున్నాడు. దీనితో ఈమె క్లీన్ చెయ్యడానికి మనిషిని పెట్టుకోక్కర్లేదు. ఏం వింతో కదా…! సంపాదించినా డబ్బు కడుపు నిండా తినకుండా దాచి ఏం చేసుకుంటుందో ఈమె…? ఈ వింత వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.