దారుణం : కొడుకును హత్య చేసిన తల్లి.. అందుకే !

ఏపీలో మద్యం రక్కసి విజ్రుంభిస్తోంది. ఏపీ సీఎం జగన్ మద్య పాన నిషేధం అని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి వర్కౌట్ కావడం లేదు దీంతో మద్యం పెనుభూతమవుతోంది. విచక్షణ లేకుండా చేస్తోంది. వావి వరస, మంచి చెడు మరచిపోతున్నారు. అలానే తాజాగా విశాఖలో దారుణం జరిగింది. మారికవలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో కన్న కొడుకునే హత్య చేసిందొక తల్లి.

murder
murder

మద్యంతో పాటు  చెడువ్యసనాలకు బానిసైన తన 18 ఏళ్ల కొడుకు వేధింపులు తాళలేక తల్లి అతన్ని హతమార్చింది. నిత్యం అందరితో గొడవ పడడంతో పాటు తనను కూడా లైంగికంగా వేధిస్తుండడంతో భరించలేని తల్లి గ్యాస్ సిలిండర్‌తో అతని తలపై మోది హత్య చేసింది. మృతుడు అనిల్‌ పై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగాక విచక్షణ కోల్పోయి వావి వరసలు మర్చిపోతే ఇలా అర్ధంతరంగా చావవలసి ఉంటుంది.