లాలీ లాలి అనే లాలించి
ఆ ఉయ్యాలకే రారాజును చేసి
ప్రపంచాన్ని జయించే వీరుడిలా
నిన్ను పెంచుతుంది…
నిశిలో శశి ఆచూకీ లేదని
ఆ మేఘాల పరాదని జరిపి
కాంతివంతమైన శశిని చూపిస్తూ
నీకు గోరుముద్దలు అందిస్తుంది….
ఒకటి, రెండు అంటూ మరెన్నో నేర్పించే
మొదటి గురువు అమ్మ…
ఇలా అమ్మ కోసం చెబుతూ ఉంటే అక్షరాలు చాలవు. అమ్మ పేరు లో ప్రేమని…. పిలుపులో మాధుర్యం నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అమ్మకి కేవలం త్యాగం, కష్టం మాత్రమే తెలుసేమో ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది. ఎంత కష్టమైనా నొప్పి చెప్పకుండానే చేసుకుపోతుంది.
మదర్స్ డే నాడు అమ్మ గొప్పతనాన్ని తెలిపే కొన్ని అద్భుతమైన కోట్స్ మీకోసం :
ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే…”మదర్స్ డే శుభాకాంక్షలు”…
మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే… హ్యాపీ మదర్స్ డే
నా రేపటి భవిష్యత్తుకే నిత్యం శ్రమించే శ్రామికురాలే అమ్మ…. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!!
ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా… మారని మాధుర్యం అమ్మ ప్రేమ..
నీవు ఎంత దూరం వద్దనుకున్నా నీ జీవితాంతం తోడుగా వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే… హ్యాపీ మదర్స్ డే..
తొలి అడుగుల్లో తడబాటులను బ్రతుకు బాటలో పొరపాటును సరిదిద్దేదే అమ్మ.. హ్యాపీ మదర్స్ డే…!