మోటోరోలా వ‌న్ ఫ్యూష‌న్ ప్ల‌స్‌.. ఫీచ‌ర్లు అదిరాయ్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మోటోరోలా కంపెనీ మోటోరోలా వ‌న్ ఫ్యూష‌న్ ప్ల‌స్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ త‌దిత‌ర ప‌వ‌ర్‌ఫుల్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 1టీబీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇందులో మెమొరీని పెంచుకోవ‌చ్చు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ పాప‌ప్ కెమెరా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 15 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

Motorola One Fusion+ smart phone launched in india

మోటోరోలా వ‌న్ ఫ్యూష‌న్ ప్ల‌స్ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ టోట‌ల్ విజ‌న్ డిస్‌ప్లే
* 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 64, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్

మోటోరోలా వ‌న్ ఫ్యూష‌న్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ వైట్‌, ట్విలైట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.16,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 24వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news