బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు మోటో ఫోన్లు.. ఆఫ‌ర్లు ఇవే..!

-

ఫ్లిప్‌కార్ట్ సంస్థ అక్టోబ‌ర్ 16 నుంచి 21వ తేదీ వ‌ర‌కు బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సేల్‌లో మోటోరోలా ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందివ్వ‌నున్నారు. సేల్‌లో మోటో జి9, మోటో వ‌న్ ఫ్యుష‌న్ ప్ల‌స్‌, మోటో ఇ7 ప్ల‌స్‌, మోటోరోలా రేజ‌ర్ ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను ఇవ్వ‌నున్నారు.

motorola to offer huge discounts on its phone during big billion days sale

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్‌లో భాగంగా మోటోరోలా ఫ్యుష‌న్ ప్ల‌స్ ఫోన్‌ను రూ.1500 డిస్కౌంట్‌తో విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్ ధ‌ర రూ.17,499 ఉండ‌గా.. రూ.16,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. ఇక మోటోరోలా రేజ‌ర్ 5జి ఫోన్‌ను ఈ మ‌ధ్యే భార‌త్‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌పై సేల్‌లో ఏకంగా రూ.40వేల భారీ డిస్కౌంట్ ఇవ్వ‌నున్నారు.

మోటో ఇ7 ప్ల‌స్ ఫోన్‌ను రూ.500 త‌గ్గింపుతో రూ.8,999 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు. మోటో జి9ను రూ.1500 త‌గ్గింపుతో రూ.9,999కు, మోటో వ‌న్ ఫ్యుష‌న్‌ను రూ.1500 త‌గ్గింపుతో రూ.15,999 ప్రారంభ ధ‌ర‌కు, మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్‌ను రూ.40వేల తగ్గింపుతో రూ.64,999 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్‌లో పైన తెలిపిన మోటోరోలా ఫోన్ల‌కు కంపెనీ అందించే డిస్కౌంట్ మాత్ర‌మే కాకుండా ఎస్‌బీఐ కార్డుల‌ ద్వారా కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. పేటీఎం ద్వారా కొంటే క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఆయా ఫోన్ల‌పై 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందివ్వ‌నున్నారు. మ‌రిన్ని డీల్స్‌, ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌ను తెలుసుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news