బికినీలో వీధుల్లో తిరుగుతూ రచ్చ చేస్తున్న మౌనీ రాయ్..!

-

ఫేమస్ సీరియల్ అయిన నాగిని ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువగా పబ్లిక్ లో బికినీలు ధరించి తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా సదురు ఫోటోలు, వీడియోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. రన్ మూవీ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మౌనీ రాయ్ ఆ తర్వాత సీరియల్స్ కి షిఫ్ట్ అయిపోయింది. ఈ బెంగాల్ చిన్నది నాగిని సీరియల్ తో భారీగా ఫేమ్ తెచ్చుకుంది.

ఇక నాగిని సీరియల్ తెలుగులో కూడా డబ్ అయిన నేపద్యంలో అటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగిని 1, 2, 3 సీజన్స్ లో మౌనిరాయ్ నటించి మెప్పించారు. ఇక ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరోపక్క ఆఫర్లను సినిమాలలో అందుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకుంది. కేజీఎఫ్ హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈమె బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా మెయిన్ విలన్ రోల్ చేయడం విశేషం. ఇందులో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్ ,నాగార్జున, అలియా భట్, రన్ బీర్ కపూర్, షారుఖ్ ఖాన్ తదితరులు ఇందులో నటించారు.

ఇక మౌనీ రాయ్ గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో ఏడడుగులు వేసింది . కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరు ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన తర్వాత ఈమె మరింత ఘాటుగా వయ్యారాలు వలకబోస్తూ బికినీలలో అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తోంది అని చెప్పాలి. ఇక ఇప్పుడేమో బికినీ ధరించి వీధుల్లో తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది మౌనీ రాయ్.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Read more RELATED
Recommended to you

Latest news