అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేస్తున్నారా ? నిజ‌మెంత ?

-

కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ 4.0 లో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి మ‌రిన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే దేశంలో అనేక చోట్ల ఇప్ప‌టికే బార్ల‌ను ప్రారంభించారు. జిమ్‌లు, యోగా సెంట‌ర్లు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు, సినిమా హాల్స్ ఓపెనింగ్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. కానీ అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేస్తున్నారంటూ.. సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ ప్ర‌చారం అవుతోంది. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా.. ఆ వార్త అబ‌ద్ధ‌మ‌ని తేలింది.

movie theaters may open from october 1st is it true

దేశ‌వ్యాప్తంగా ఉన్న సినిమా హాల్స్, మ‌ల్టీప్లెక్సుల యాజ‌మాన్యాలు అక్టోబ‌ర్‌లో ద‌స‌రా పండుగ ఉన్నందున అక్టోబ‌ర్ 1 నుంచి వాటిని ఓపెన్ చేసేందుకు కేంద్రాన్ని అనుమ‌తి కోరాయ‌ని, కేంద్రం కూడా అందుకు అనుమతిచ్చింద‌ని చెబుతూ.. ఓ వార్త సోష‌ల్ మీడియాలో, ప‌లు వెబ్‌సైట్ల‌లో ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆ వార్త అబ‌ద్ద‌మ‌ని తేలింది. అది ఫేక్ వార్త అని, దాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని, కేంద్రం అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ను తెరిచేందుకు ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని, ఇంకా అస‌లు ఆ విష‌యంపై నిర్ణ‌య‌మే తీసుకోలేద‌ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డైంది.

కాగా కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాల్స్ ను ఓపెన్ చేసుకుంటామ‌ని చెప్పి థియేట‌ర్ల యాజ‌మాన్యాలు కేంద్రాన్ని కోరుతున్నా.. ఆ విష‌యంపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అలాగే త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు సినిమా హాల్స్‌తోపాటు విద్యాసంస్థలు కూడా మూసి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news