నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాల్లో దర్పల్లి, మోపాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేసేందుకు ఆయన బయలుదేరారు. ఈక్రమంలో విగ్రహావిష్కరణకు అనుమతి లేదని.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.
ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య నిజామాబాద్ లో ఘర్షన జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో పాటు ఎంపీపై దాడి చేశారు. ఎంపీ అరవింద్ కారును కూడా ధ్వంసం చేశారు. ఈ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వివాదంపై ఎంపీ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ని తిడితే కొట్టడమే మంచిదంటూ.. టీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్థర్ రెడ్డి ఇటీవల కామెంట్ కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీ అరవింద్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.