BJP ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తాం: ధర్మపురి అరవింద్

-

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. అసద్ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తామంతా గల్లీలో సైనికులమని, దిల్లీలో చాణుక్యులున్నారన్నారు. ఏపీలో బీజేపీ వైసీపీ, టీడీపీలతో సమాన దూరమే పాటిస్తుంద‌ని వెల్లడించారు. అన్ని పార్టీలను వీక్ చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమ‌న్నారు.

అన్ని పార్టీలను వీక్ చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆపార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి బీజేపీ ఉంటాడేమో అన్నారు. TRS MLC కవిత ప్రైవేటు జెట్లలో తిరిగిన ఖర్చును ఎవరు పెట్టారో చెప్పాలన్నారు ఎంపీ అర్వింద్. ప్రతీసారి ప్రైవేటు జెట్లలో ఎందుకువెళ్లారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఎంఐఎం చేతుల్లో ఉన్నట్లుగా అసదుద్దీన్ మాట్లాడం సరైంది కాదన్నారు ఎంపీ అర్వింద్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version