ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే… ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతది అని బండి సంజయ్ అన్నారు. అయితే అమెరికాలాంటి దేశంలో కూడా మొదట ఈ మూడు రంగాలు బాగుపడిన తరువాతే.. ఆ దేశం అగ్రదేశమైంది… అందుకే నరేంద్ర మోదీ గారి సారధ్యంలో ఆయా రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా మన తెలంగాణకు మోదీ ప్రభుత్వం అత్యధిక నిధులిస్తోంది. గత పదేళ్లలో మోదీ సారథ్యంలో గడ్కరీ ఆశీస్సులతో రోడ్ల విస్తరణ కోసం లక్ష కోట్లు కేటాయించింది. ఇయాళ తెలంగాణలో ఏ మూలకు పోవాలన్నా రెండు గంటల్లో రయ్ రయ్ మంటూ వెళ్లే అవకాశం ఏర్పడిందంటే అది మోదీ గారి ఘనతే కదా… అంతెందుకు కేంద్రమే రూ.18 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ ను నిర్మిస్తున్నం… గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ నిధుల ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లను విస్తరిస్తున్నాం.
ఇగ రైల్వేల అభివ్రుద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నం. గత పదేళ్లలో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినం. ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్ లోనే రూ.5 వేల 336 వేల కోట్లు తెలంగాణకు కేటాయించినం. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ కేటాయించలేదు. దటీజ్ మోదీ. ఒక్కసారి సికింద్రాబాద్ చూసి రండీ. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ను ఎట్లా వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నడు. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారుస్తున్నం. అంతెందుకు రేపు చర్లపల్లి కొత్త టెర్మినల్ ను మోదీ గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నరు అని బండి పేర్కొన్నారు.