తూర్పుగోదావరి జిల్లా : రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రామ్. క్రమశిక్షణ అంకితభావంతో ఉన్న కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నానని… ముఖ్యమంత్రి జగన్ తన పైన నమ్మకంతో ఎంపీ గా అవకాశం ఇచ్చారని తెలిపారు.. నా తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలని… కొంతమంది నాయకులు నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్తున్నారని మండిపడ్డారు.
టిడిపి నేతలు బుచ్చయ్యతో పెందుర్తి వెంకటేష్ లో నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని జక్కంపూడి కి సవాల్ విసిరారు. జక్కంపూడిలా తాను చీకటి రాజకీయాలు చెయ్యను, నువ్వు చేసే ప్రతి దీ స్కూల్ కి వెళ్లే పిల్లవాడిని అడిగితే చెప్తాడన్నారు.
జేడి లక్ష్మీనారాయణ తో ఒక ప్రోగ్రాం లో మాత్రమే కలిశాను, నేను సెల్ఫీ దిగితే ఫూటేజ్ చెక్ చేసుకోవాలని చురకలు అంటించారు. ఆ సందర్భంలో సిఎం జగన్ పరిపాలనను జేడి ప్రశంసించారని… గుర్తు చేశారు. తనను రఘురామకృష్ణంరాజు తో పోల్చడం సిగ్గు చేటని మండిపడ్డారు. ”తనకు పార్టీ ఇచ్చిన లక్ష్మణ గీత దాటను..నువ్వు నీ పరధిలో ఉంటే మంచిది..లేదంటే రెండు రాష్ట్రాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా..” అంటూ హెచ్చరించారు.