ట్విటర్ ప్రొఫైల్ మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కాంగ్రెస్ తీరుపై కొద్దిరోజులుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. ముఖ్యంగా పీసీసీ తీరుపై బహిరంగంగానే మాటల బాణాలు విసురుతున్నారు. తాజాగా ఆయన ట్విటర్‌ ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్‌ హోంగార్డు అంటూ పేర్కొనడం గమనార్హం. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని.. అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్‌ ఖాతాలో ఆయన మార్పులు చేశారు.

చండూరులో నిర్వహించిన సభలో అద్దంకి దయాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తనను తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన రేవంత్‌ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రేవంత్‌ క్షమాపణ చెబుతూ ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు.

మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు అద్దంకి దయాకర్‌ చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరఫున క్షమాపణలు చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు అద్దంకి దయాకర్‌ తెలిపారు. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పానని.. ఇప్పుడు మరోసారి క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. ఇరువురి క్షమాపణలు చెప్పినప్పటికీ కోమటిరెడ్డి ట్విటర్‌ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌కు హోంగార్డు అంటూ మార్పులు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news