వలస కార్మికులకు ఎంపీ సంతోష్‌ నిత్యాన్నదానాలు

-

తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఇప్పుడు వలస కార్మికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’తో యావద్దేశం చూపు తనవైపు తిప్పుకున్న యువ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన పెదనాన్న, తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఈ నిత్యాన్నదాన క్యాంపులు వెలిసాయి.  ఎంపీ సంతోష్‌ తన స్వంత పైకంతో ఈ ప్రజాహిత కార్యం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

లాక్ డౌన్ తో పేదలు ఆకలితో అలమటించకుండా చూడాలన్న సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం దిగ్విజయంగా కొనసాగుతుంది. కరీంనగర్ లోని 40వ డివిజన్ లోని ఈఎన్ గార్డెన్ లో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణితో కలిసి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. వలసకూలీలకు వీరు స్వయంగా భోజనాలు కూడా వడ్డించారు. కరోనా ప్రబలుతున్న నేపధ్యంలో… సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు. అలాగే 15 రోజుల వరకు అవసరమయ్యే నిత్యవసర వస్తువులను వలస కూలీలకు అందజేశారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కూలీల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన ఎంపి సంతోష్ కుమార్ కు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణిలు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ సంతోష్ కుమార్ తన సొంత ఖర్చులతో రోజు వెయ్యిమంది అకలి తీర్చడం అభినందనీయమన్నారు.

బోరబండలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో ఇంటింటికీ భోజనం ప్యాకెట్ల పంపిణీ

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో అలమటించ కూడదన్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సూచన మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి సహకారంతో నేడు బోరబండలో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి ఆద్వర్యంలో పేద కుటుంబాలకు; వలస కూలీలకు  ఇంటింటికీ వెళ్లి 700 భోజనం ప్యాకెట్ల ను అందజేయడం జరిగింది. ఈసందర్భంగా బాబా ఫసియుద్దీన్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం; GHMC ఆద్వర్యంలో వీలైనంత వరకు అన్నిరకాల ఏర్పాటు చేస్తున్నపటికి కూడ  ఇంకా కొంతమందికి అవసరం అయిన పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాల్సి వస్తుందని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు అడిగిన వెంటనే పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తరఫున భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయించడం చాలా గొప్ప విషయం అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి బొరబండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ అయితే పేద ప్రజలకు భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో  వారికి ఇదే విధంగా లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వలస కార్మికుల అన్నదానం కొనసాగింపు

సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్నీ జడ్పీటీసీ ఉమకొండయ్య గారు ప్రారంబించారు .    సంతోష్ కుమార్ గారి పేరు మీద  ఈరోజు  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో  కుదురుపాక గ్రామంలో సుమారు వంద మందికి అన్నదానం చెయ్యడం జరిగింది .ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం వచ్చిన వలసకూలీలకు  స్థానిక ప్రజాప్రతినిధులు భోజనం వడ్డించారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీల కడుపు నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానిక ప్రజలు కొనియాడారు .తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందిస్తుందని తెలిపారు. అయినప్పట్టికీ  కొన్ని కారాణాల వాళ్ళ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందని కార్మికులు  ,వలస కూలీలు ఆకలితో అలమటించకుండా అన్నదానం తో తన దాతృత్వాన్ని చాటు కున్నాడని కొనియాడారు.

సుమారు రెండు, మూడు వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య పేర్కోన్నారు.

ఈ కార్యక్రమంలో బోల్లవేణి భానుశ్రీ తిరుపతి యాదవ్ Ex MPTC , SI శ్రీనివాస్ ,ఎంపీపీ  పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీ రాములు, గ్రామ TRS అధ్యక్షుడు చిక్కాల సుధాకర్ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్ వార్డ్ మెంబర్లు లు మరియు స్థానికప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా.

సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం వచ్చిన వలసకూలీలకు ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీల కడుపు నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి ఈ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంపీ సంతోష్ కుమార్ తమ నియోజకవర్గ బిడ్డ కావడం గర్వంగా ఉందన్నారు. వలస కూలీలు ఆకలితో అలమటించకుండా అన్నదానం తో తన దాతృత్వాన్ని చాటు కున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉమా కొండయ్య, ఎంపీపీ వేణుగోపాల్, ఎమ్మార్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండు, మూడు వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని పేర్కోన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version