బాబు@25 : డర్టీయస్ట్ అంటూనే విషెస్ చెప్పిన విజయసాయి..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదేంటి.. విజయసాయి, చంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా. అవును మరి నిజంగానే తెలిపారు.. కాకపోతే అవి మీరు అనుకునే శుభాకాంక్షలు కాదులలేండి.. తనదైన స్టైల్ లో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే విషెస్ చెప్పారు విజయసాయి రెడ్డి.

‘బాబు..వెన్నుపోటుతో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠంలో కూర్చొని, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, ఇంకొన్ని వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ, డర్టీయస్ట్ పొలిటిషియన్‌గా, చివరికి రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురై, వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు.. సిల్వర్ జూబ్లీ విషెస్’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇకపోతే.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి సరిగ్గా 25 ఏళ్లు.. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయసాయి, చంద్రబాబుని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version