లక్ష్మీ బాంబ్ ట్రైలర్‌పై మిస్టర్ పర్‌ఫెక్ట్ ప్రశంసలు..!

-

బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లక్ష్మి బాంబ్. మన టాలీవుడ్ మూవీ అయిన ముని 2కు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే. కొరియో గ్రాఫర్,యాక్టర్ అయిన రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరెకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా అందాల భామ కియారా అద్వానీ నటిస్తుంది. నవంబర్ నెల మొదటి వారంలో ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కూడా విడుదల చేసారు. దెయ్యాలు, ప్రేతాత్మలు, భూతాలు వంటివి అసలు లేవు. కేవలం మన అపోహలే .. అనే డైలాగ్‌తో ప్రారంభం అయింది.

దెయ్యం ఎదురుపడితే నేను గాజులు వేసుకుంటా అంటూ అక్షయ్ కుమార్ అదిరిపోయే డైలాగ్ చెప్పారు. ఇంకో సీన్‌లో ఏకంగా ఎరుపు రంగు చీర వేసుకొని నేను ఎలా ఉన్నాను చెప్పండి అంటూ… అందంగా ఉన్నా కదూ.. నన్ను వదలండి . నన్ను పట్టుకోడానికి మీకెంత ధైర్యం అంటూ అక్షయ్ కుమార్ డైలాగ్స్ తో ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కనబరిచారు. మూవీ ట్రైలర్ చుసిన అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు..ఈ చిత్రంలో అక్షయ్ ట్రాన్సజెండెర్ గా నటిస్తుండటం విశేషం. అక్షయ్, మీ నటన అద్భుతంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు అంటూ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version