మాజీ తహసీల్దార్ నాగరాజు వద్ద పోలీసు ఎఫ్‌ఐఆర్ కాపీలు దొరకడం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. సీజ్ చేసిన భూపత్రాల్లో.. పలు పోలీసస్టేషన్ల పరిధిలో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీలు, కోర్టు కేసులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లతో నాగరాజుకు ఏం పని? అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. భూములకు సంబంధించిన పత్రాలు, పహాణీలు, పాసు పుస్తకాలు, సేల్ డీడ్ లతో పాటు.. ఎఫ్‌ఐఆర్‌లు లభ్యం అయ్యాయి.
మూడు రోజుల ఏసీబీ కస్టడీలో నోరు మెదపడం లేదు నింధితులు. ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆయా సేల్ డీడ్‌లు, పహాణీల్లో పేర్కొన్న వ్యక్తులను విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నరు. ఆ ఫోన్లను విశ్లేషించేందుకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.