”మిస్టర్ ప్రెగ్నెంట్” కడుపుతో ఉన్నానంటున్న సోహెల్‌ !

బిగ్‌ బాస్‌ -4 షో తో తెలుగు ప్రేక్షకులకు సోహెల్‌ దగ్గరైన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ”కథ వేరే ఉంటది.. నేను గిట్లనే ఉంట” అంటూ తెలంగాణ యాస మరియు భాషతో అందరిని అలరించాడు సోహెల్‌. సినిమా పై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రలో కి అడుగు పెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యం లోనే కథానాయకుడిగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా కు ”మిస్టర్‌ ప్రెగ్నెంట్‌” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం సినిమా టైటిల్‌, హీరో ఫస్ట్‌ గ్లిమ్స్‌ ను నేచురల్‌ స్టార్‌ నాని నెట్టింట్లో షేర్‌ చేశారు. శ్రీనివాస్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చాలా స్పీడ్‌ గా జరుగుతోంది.