టీమిండియా కరోనా కల్లోలం… కోచ్ రవిశాస్త్రికి పాజిటివ్ !

చైనా లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి ఈ వైరస్‌ దాటికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రంగాలకు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. విద్యారంగం నుంచి మొదలు పెడితే… క్రీడా రంగం వరకు అన్ని కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. ఇక తాజాగా ఈ కరోనా మహమ్మారి… టీం ఇండియాలో కలకలం రేపింది.

భారత జట్టు కోచ్‌, మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి కి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. నిన్నటి నుంచి కాస్త… అస్వస్థతతో ఉన్న రవిశాస్త్రి… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో రవి శాస్త్రికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో రవి శాస్త్రి హోం క్వారంటైన్‌ లోకి వెళ్లారు. అయితే… టీం ఇండియా లోని ఆట గాళ్లకు మాత్రం పాజిటివ్‌ రాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అటు ఫీల్డింగ్‌ మరియు బౌలింగ్‌ కోచ్‌ లను మాత్రం క్వారంటైన్‌ కు పంపారు.