రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ న్యూయార్క్ సైబెకా ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. రూ. 153 కోట్ల (17.4 మిలియన్ డాలర్ల)తో ఆయన ఓ భవనాన్ని ఉచిక్వీటి అనే టెక్ సంస్థ సిఎండి అయినా రాబర్ట్ తెరా నుంచి కొనుగోలు చేశారు. ఈ భవనాన్ని రాబర్ట్ 2018లో 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అంటే రాబర్ట్ కు తక్కువకే ఈ భవనం విక్రయించడం గమనార్హం.

ఇప్పుడు ఈ భవనాన్ని ముఖేష్ అంబానీ 17.4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. కాగా, ముకేశ్ అంబానీకి ఇవి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భవనాలు, ఆస్తులు ఉన్నాయి. ఇతనికి అత్యంత ఖరీదైన కార్లు, లగ్జరీ విల్లాలు ఉన్నాయి. ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. నిమిషాల్లోనే లక్షలలో డబ్బులను సంపాదిస్తాడు. ఇతను మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు.