78.8 బిలియన్ డాలర్లకు పడిపోయిన ముఖేష్ అంబాని ఆస్తి…!

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ 78.3 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆయన ప్రధాన సంస్థ ఆర్‌ఐఎల్ షేర్ల ధరలు చివరిలో పడిపోవడంతో అతని ఆస్తుల విలువ కూడా పడిపోయింది. టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ మరియు బెర్నార్డ్ ఆర్నాల్ట్ యొక్క నికర విలువ పెరిగింది.

బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం వరుసగా ఇద్దరు నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో, ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబాని ఆస్తుల విలువ పెరిగింది. ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ చైర్మన్ మరియు సిఇఒ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి, నికర ఆస్తుల విలువ 80.2 బిలియన్ డాలర్లకు (రూ. 6.04 లక్షల కోట్లు) పెరిగింది. మరోవైపు, ఆర్నాల్ట్ నికర విలువ 1.24 బిలియన్ డాలర్లు తగ్గి 80.2 బిలియన్ డాలర్లకు (రూ. 6.01 లక్షల కోట్లు)కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version