ముంబైని యూటీ చేసేందుకు బీజేపీ ప్లాన్…. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ, శివసేన మధ్య వివాదాలు ముదురుతున్నాయి. వరసగా ఈడీ అధికారులు శివసేన నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. తాజాగా శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేసింది. ఇదే కాకుండా ఇప్పటికే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉన్న ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఈ నేపథ్యంలో శివసేశ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ని కేంద్ర పాలిత ప్రాంతం( యూటీ) చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందు కోసం బీజేపీ వ్యూహ రచన చేస్తుందని ఆరోపించారు. కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా చెప్పారు. మరాఠీ మాట్లాడే వారి సంఖ్య ముంబైలో తగ్గిందనే కారణంతోనే బీజేపీ ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news