మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ సినిమా గాడ్ ఫాదర్. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మళ్లీ తెస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుకూనంగా కథను మర్చి రాశారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు చిరు. తన గాడ్ ఫాదర్ మూవీలో.. పూరి జగన్నాథ్ నటిస్తున్నాడని తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే తన సినిమాలో నటిస్తున్నాడు పూరి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్ గా మారింది.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022