సోనూ మరో సాయం.. ఆ కుటుంబానికి అండగా !

-

కరోనా కష్ట సమయంలో ప్రముఖ నటుడు సోను సూద్ ప్రజలకు తన వంతుగా ఏదోక సహాయం చేస్తున్నారు. దేశం నలుమూలలా అతను ఏదోక సహాయం చేస్తూనే ఉన్నాడు. అడిగిన వారికి కాదు అనకుండా ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూడా ఒక ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.

ముంబైలో వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు డీ కొనడంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్ అక్కడిక్కడే మరణించాడు. ఈ సంఘటన ముంబైలోని ఓషివారాలో జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ పై నుండి వెళ్లి అతనిని గుద్దడంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నటుడు సోను సూద్ ఈ రోజు ఆ వ్యక్తి కుటుంబాన్ని కలుసుకుని వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news