కోవిడ్ పేషెంట్స్ కోసం కారు అమ్మేసి సాయం.. సోషల్ మీడియాలో వైరల్ !

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత, అలాగే రెమిడిసివిర్ మందుల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలోనే ముంబైలోని ఒక యువకుడు తన ప్రాంతంలోని ప్రజల కోసం ఆక్సిజన్ సిలిండర్లను కొనడానికి కొన్ని రోజుల క్రితం కొనుక్కున్న తన ఎస్‌యూవీ కార్ ని 22 లక్షలకు విక్రయించాడు. మలాడ్ నివాసి అయిన షహనావాజ్ షేక్ తన ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని ఆక్సిజన్ సంక్షోభంతో అనేక మంది కరోనా సోకిన రోగులకు దానం చేయడానికి అమ్మేశారు. 

సహాయం అవసరమైన వారితో ఫోన్ కాల్ ద్వారా సమన్వయం మరియు సమర్థవంతంగా సంభాషించడానికి ఒక టీమ్ టో పగలు మరియు రాత్రి పనిచేసేలా ఒక కంట్రోల్ రూమ్‌ ను కూడా షేక్ ఏర్పాటు చేశాడు. ఈ బృందానికి ప్రస్తుతం ప్రతిరోజూ 500 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అతను తన ఫోర్డ్ ఎండీవర్‌ను విక్రయించిన తరువాత, అవసరమైనవారికి 160 ఆక్సిజన్ సిలిండర్లను సేకరించగలిగాడు. ఉచిత ఆక్సిజన్ సిలిండర్లతో ఇప్పటివరకు 4,000 మందికి పైగా ఆయన సహాయం చేశాడు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి దేశం మొత్తం ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్ , ఐసియు బెడ్స్ అలానే మందులతో సహా ఇతర అవసరాల కొరత ఎదుర్కొంటున్న ఈ సమయంలో  షేక్ వంటి హీరోలు నిజంగా అవసరం.