ఆక్సిజన్ కోసం రంగంలోకి ఎయిర్ ఫోర్స్.. బేగంపేట నుండి ఒరిసాకి ఎయిర్ లిఫ్ట్ !

ఆక్సిజన్ సరఫరా కోసం రంగంలోకి దిగాయి యుద్ధ విమానాలు. తెలంగాణలో ఆక్సిజన్ అవసరాల కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఒరిస్సా కి ఆక్సిజన్ ట్యాంక్ లను పంపారు. దగ్గర ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఈ విమానంలో ట్యాంకర్లు ఎక్కించడం పర్యవేక్షించారు. త్వరగా ఆక్సిజన్ తెలంగాణ కు తీసుకొచ్చేందుకు ఇలా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

రోడ్డు మర్గాన వెళితే కనీసం మూడు రోజుల సమయం పడుతుందని, ఇలా పంపి తెప్పించుకోగాలిగితే ఈ రోజు సాయంత్రానికి అవి నింపుకుని తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా మొత్తం మీద మూడు రోజుల సమయం కలిసి రానుందని అంటున్నారు.  ఇక ఇలా ఆక్సిజన్ కోసం ట్యాంకులు యుద్ధ విమానాల్లో పంపడం దేశంలోనే తొలిసారి అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి ఈటెల, సీఎస్ సోమేశ్ కుమార్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.