నేటితో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ గడువు ముగియనుంది. ఎల్లుండి అంటే పదో తేదీన దాదాపు 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే 14 వ తేదీన దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదల ఉంటుంది.
అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసీపీ అలాగే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కి సంబంధించి అధినేత చంద్రబాబుతో సహా మిగతా అందరూ రోడ్డెక్కి ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీలో సైతం ముఖ్యమంత్రి జగన్ తప్ప మిగతా అందరూ రోడ్డెక్కి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఈ సారి పట్టణ పుర ఓటర్లు ఎవరికి పట్టం కట్టడం ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.