మురళీ ముకుంద్ అరెస్ట్.. రిమాండ్ కి తరలించిన పోలీసులు

-

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీముకుంద్, అతడి కుమారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్, అతడి కుమారుడు ఆకాష్ ఇంట్లో పనిచేసే యువతిని బెదిరించి లైంగిక దాడి చేసి, రోజూ కొడుతున్నారని బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దళిత యువతి (22) ఇళ్లల్లో పని చేసేందుకు నగరంలోని ఓ ఏజెన్సీలో పేరు నమోదు చేసుకుంది.

ఇక ఆ సమయంలో జరిగిన దారుణాన్ని యువతి ఇటీవలే తల్లికి చెప్పింది. ఆమె సహాయంతో ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. మురళీ ముకుంద్, ఆకాష్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మురళీ ముకుంద్ ను నాంపల్లి కోర్టు జడ్జీ ఎదుట హాజరు పరిచారు పోలీసులు. మురళీ ముకుంద్ సెల్ ఫోన్, పాస్ ఫోర్ట్ సీజ్ చేశారు. పని మనిషిపై అత్యాచారం కేసులో అరెస్టు చేశారు. మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఆకాశ్ కోసం వెతుకుతున్నారుు.

Read more RELATED
Recommended to you

Exit mobile version