మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

-

దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం దేశానికి తీరని నష్టం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగంగా తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘భారతదేశం టెర్రరిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జొలిపించదు.

కాశ్మీర్‌లో జరిగిన అమానుష ఘటనలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దేశ భద్రత కోసం మరణించిన మురళీ నాయక్ వంటి వీర జవాన్లు గర్వకారణం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం,’’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘సింధూర్’ ఆపరేషన్ టెర్రరిస్టులపై భారత్ ఉక్కుపాదం మోపుతోందని సీఎం చెప్పారు. సైనికులు బార్డర్ వద్ద నిద్రాహారాలు మాని దేశాన్ని కాపాడుతున్నారని, మనం వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘భారత్ మాతకి జై’’ నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news