శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పై బయోపిక్ వస్తుందని ప్రకటించినప్పటి నుండి అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకలో తమిళుల ఊచకోత జరిగినపుడు ముత్తయ్య ఒక్కసారైనా స్పందించాడా అంటూ, అలాంటి వ్యక్తి జీవిత కథలో నువ్వెలా నటిస్తావని విజయ్ సేతుపతిపై విమర్శలు జల్లుతున్నారు. ఐతే ఈ వివాదంపై ముత్తయ్య మురళీధరన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.
మురళీధరన్ మాట్లాడుతూ, నిజానికి నా జీవిత కథని తెరమీదకి తీసుకువస్తామని అన్నప్పుడు నేను వద్దన్నాడట. కానీ తనని క్రికెటర్ గా చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టంతో పాటు గురువులు చేసిన కృషి బయటకి తెలుస్తుంది అన్నప్పుడు బయోపిక్ కి అంగీకరించానని అన్నాడు. ఇంకా తమిళుల కోసం తానేం చేస్తున్నానో అందరికీ తెలుసని, అసత్యాలు ప్రచారం చేయవద్దని, మహిళల సంరక్షణ విషయంలో తాను చేస్తున్న వాటి గురించి తెలుసుకోవాలని అన్నాడు.