హైద‌రాబాద్ లో దారుణం..పాత‌బ‌స్తీలో రోడ్డుపై న‌గ్నంగా డెడ్ బాడీ..!

-

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో దారుణం చోటు చేసుకుంది. న‌డీరోడ్డుపై నగ్నంగా ఉన్న మృత‌దేహం క‌ల‌క‌లం రేపింది. పాత‌బ‌స్తీలోని చాంద్రయాణ గుట్ట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో నిర్మానుష్య ప్ర‌దేశంలో రోడ్డు పై మృత‌దేహం ప‌డి ఉంది. అటు వైపుగా వెళుతున్న వ్య‌క్తులు మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించ‌గా శ‌రీరంపై ప‌లు చోట్ల క‌త్తిపోట్ల‌ను గుర్తించారు.

దాంతో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చి రోడ్డుపై శ‌వాన్ని ప‌డేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సంఘ‌ట‌నా స్థలంలో ఎలాంటి ఆధారాలు ల‌భించ‌క‌పోవ‌డంతో పోలీసులు జాగిలాల‌ను రంగంలోకి దింపి నింధితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తు్న్నారు. ఇక ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. హ‌త్య చేసి మృత దేహాన్ని రోడ్డుపై ప‌డేయ‌టంతో స్థానికులు ఎంతో ఆందోళ‌న చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news