సేనాని ఇలా చేశారేంటి…ఎన్నాళ్లు ఈ ‘సైడ్ క్యారెక్టర్’..

-

సినిమాల్లో పవన్ కల్యాణ్ అంటే నెంబర్ 1 హీరో…అసలు పవన్ పేరు చెబితే చాలు రికార్డులు బద్దలైపోతాయి. మరి సినిమాల్లో తిరుగులేని హీరోగా ఉన్న పవన్…రాజకీయాల్లో మాత్రం కనీసం సైడ్ క్యారెక్టర్ రేంజ్‌లో కూడా ఉండలేకపోతున్నారు. అదేమన్న అంటే మన జనసైనికులు ఏమో…అన్న సి‌ఎం సి‌ఎం అని అరుస్తారు. ఆయనేమో సి‌ఎం అయ్యే దిశగా మాత్రం రాజకీయం చేయడం లేదు. మంచి ఉద్దేశంతోనే పార్టీ పెట్టి మొదట్లోనే చేతులెత్తిసినట్లు కనిపిస్తున్నారు.

2014లో ఏదో చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చినా, 2019 ఎన్నికల్లో మాత్రం సత్తా చూపిస్తానని బరిలో దిగి పవన్ దారుణమైన ఓటమిని చవిచూశారు. సరే గెలుపోటములు సహజం…ఓటమి, గెలుపుకు తొలిమెట్టు అని రెండు మూడు సూక్తులు గుర్తు తెచ్చుకుని మళ్ళీ కష్టపడి పార్టీని పైకి లేపుదామని పవన్ ఏ కోశాన అనుకున్నట్లుగా కూడా లేరు. ఓ వైపు మన జనసైనికులు ….మన సేనాని నెక్స్ట్ సి‌ఎం అయిపోతారని కలలు కంటున్నారు.

మరి ఆ కలలకు తగ్గట్టుగా మన సేనాని మాత్రం పనిచేయడం లేదు…మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ, సైడ్ క్యారెక్టర్ రేంజ్‌లో ఉండిపోయారు. అసలు రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్నా సరే సేనాని ఏమో ఉపయోగించుకోవడం లేదు. ఓ వైపు జగన్ బాగా బలంగా ఉన్నా సరే, చంద్రబాబు చాలా వీక్‌గా ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ప్రజల కోసం గట్టిగా పొరాడి, బాబు ప్లేస్‌ని రీప్లేస్ చేయాలని కల్యాణ్ గారు చూస్తున్నట్లు కనిపించడం లేదు.

అందుకే పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్‌ల్లో టి‌డి‌పి ఎంత ఘోరంగా ఓడితే అంతకంటే ఘోరంగా మనం ఓడిపోవాలని పవన్ ఫిక్స్ అయి ఓడినట్లు కనిపిస్తోంది. సరే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీని ఎదురుకోవడం మా వల్ల కాదని బాబు సైడ్ అయ్యారు. మరి అలాంటి సమయంలోనైనా జనసేనని వైసీపీకి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేశారా? అంటే అది చేయలేదు. పోటీ నుంచి తప్పుకున్నామని చెప్పి అక్కడక్కడ పోటీ చేసి కొన్ని స్థానాలు గెలుచుకున్న టి‌డి‌పి కంటే జనసేన పూర్తి స్థాయిలో పోటీ చాలా దారుణమైన ఫలితాలు తెచ్చుకుంది.

ఏదో గోదావరి జిల్లాల్లో తప్ప, మిగిలిన జిల్లాల్లో జనసేన సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అంటే టి‌డి‌పికి కూడా పోటీ ఇచ్చే స్థాయిలో మన సేనాని ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంకా ఇలాగే రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ కంటిన్యూ చేసేలా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news