వైరల్ పిక్ : ఒకే ఫ్రేమ్‌లో సంగీత దిగ్గజాలు..!!

-

తెలుగు సంగీత ప్రపంచంలోని దిగ్గజాలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, స్వరాల పుత్రుడు కోటి, మెలోడి బ్రహ్మ మణిశర్మ, డ్రమ్స్ శివమణి.. యువ సంచలనం తమన్ ఇలా అందరూ ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. దాని కథేంటో ఓసారి చూద్దాం.

తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో, నా సంగీతంలో ఎంతో ముఖ్యమైన లెజెండ్స్ ఎస్పీబీ గారు, కోటిగారు, మణిశర్మ గారు, డ్రమ్స్ శివమణి గారు’ అంటూ ఈ నలుగురు పేర్లను ప్రస్థావించాడు. అయితే ఇది ఏ సందర్భంలో దిగిన ఫోటో అనేది మాత్రం వెల్లడించలేదు.

ప్రస్తుతం తెలుగులో తమన్ హవా కొనసాగుతోంది. వెంకీమామ, డిస్కోరాజా, అల వైకుంఠపురములో ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బస్టర్స్ ఇస్తూ సంగీత ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. ఇక చాలా కాలం తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఫామ్‌లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్‌తో ఇరగ్గొట్టేశిన మణిశర్మ.. కొరటాల-చిరు సినిమాకు, రామ్ RED సినిమాకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version