టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. విలక్షణమైన నటనలతో, విభిన్న పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు. రానా అనారోగ్యంపై రూమర్స్ అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ అయ్యాయి. అయితే వాటి వెనుకున్న అసలు మ్యాటర్ ఇప్పుడు తెలుస్తోంది. బాహుబలి సినిమాలోని భళ్లాలదేవ పాత్రలో భారీ కాయంతో అందర్నీ భయపెట్టిన రానా.. హాథీ మేరీ సాథీ సినిమాకు చీపురు పుల్లలా మారిపోయాడు.
ఎన్నో వాయిదాల అనంతరం..
ఎన్నో వాయిదాల అనంతరం.. హాథీ మేరీ సాథీ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా హీరోగా వస్తోన్న ఈ చిత్రం తమిళ తెలుగు హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌లో రానా లుక్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. రానా కనబడిన తీరు, అతని పర్ఫామెన్స్ చూసిన ప్రతీ ఒక్కరూ అవాక్కయ్యారు. అడవుల సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా గురించి పడిన కష్టం గురించి రానా తాజాగా వెల్లడించాడు.
అంతటి కష్టమైన పని..
రానా ఈ మూవీ కోసం దాదాపు 30 కిలోలు తగ్గడమే కాదు.. సినిమా మొత్తం తన ఎడమ భుజాన్ని పైకి ఎత్తి నటించాడట. ఎప్పుడూ భారీకాయంతో ధృడంగా ఉండాలనుకునే తనకు ఈ స్థాయిలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైందని రానా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న ఫిజికల్ ట్రైనింగ్ వండర్‌ఫుల్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపాడు.
సినిమా లుక్ కోసమే..
అందుకే రానా ఈ మూవీ లుక్ కోసమే అలా బక్క పలచగా తయారయ్యాడు. కానీ ఆయన లుక్ చూసిన ప్రతీ ఒక్కరూ అనారోగ్యం కారణంగానే అలా తయ్యారయ్యాడని అనుకున్నారు. అంతేకాకుండా మరికొందరైతే.. అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నాడని వార్తలు కూడా రాసేశారు. అయితే అవన్నీ తప్పుడు వార్తలేనని రానా ఖండించాడు కూడా.
ప్యాన్ ఇండియా చిత్రంతో..
ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళ్‌లో ‘కాడన్’గా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్యాన్ ఇండియా చిత్రంతో మరోసారి అందర్నీ పలకరించేందుకు వస్తున్నాడు. రానాకు బాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉండటంతో బాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.