Fact Check: దుబాయ్ మ‌సీదులో రామ భ‌జ‌న చేస్తూ కీర్త‌న‌లు ఆల‌పిస్తున్న ముస్లింలు.. నిజ‌మేనా ?

-

సోష‌ల్ మీడియాలో రోజూ అనేక పోస్టులు వైర‌ల్ అవుతుంటాయి. వాటిల్లో టెక్ట్స్‌, ఫొటోలు లేదా వీడియోలు ఉంటాయి. అయితే ఏ ఫేక్ వార్త అయినా స‌రే కొన్ని రోజుల పాటు మాత్ర‌మే వైర‌ల్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఫేక్ అని రిపోర్టు ఇస్తారు క‌దా, దీంతో సోష‌ల్ ప్లాట్‌ఫాంల నుంచి తొల‌గిస్తారు. అయితే ఒక వీడియో మాత్రం గత 2 ఏళ్లుగా వైర‌ల్ అవుతూనే ఉంది. దాన్ని వెరిఫై చేయ‌గా అది ఫేక్ అని తేలింది.

దుబాయ్‌లోని ఓ మ‌సీదులో కొంద‌రు ముస్లిం మ‌హిళ‌లు, వ్య‌క్తులు రామ భ‌జ‌న చేస్తున్నార‌ని, రామ సంకీర్త‌న‌ల‌ను ఆల‌పిస్తున్నార‌నే ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. యూట్యూబ్‌లో అది ఎక్కువ‌గా వైర‌ల్ అవుతోంది. రెండేళ్లుగా దాన్ని చాలా మంది చూశారు. అయితే వెరిఫై చేయ‌గా అది ఫేక్ అని తేలింది.

 

స‌ద‌రు వీడియో తీసిన ప్ర‌దేశం దుబాయ్ కాదు, ఏపీలోని పుట్ట‌ప‌ర్తి. అక్క‌డ స‌త్య‌సాయిబాబా ఆశ్ర‌మంలో భ‌క్తులు బాబాను ఉద్దేశించి భ‌జ‌న‌ల‌ను చేస్తూ కీర్త‌న‌ల‌ను ఆల‌పిస్తున్నారు. అక్క‌డికి దుబాయ్ మాత్ర‌మే కాదు, ఇత‌ర అర‌బ్ దేశాల నుంచి కూడా భ‌క్తులు వ‌స్తుంటారు. అక్క‌డ ఇలాంటి భ‌జ‌న‌లు జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, అన్ని మ‌తాల‌కు చెందిన వారు బాబాను ఆరాధిస్తార‌ని, క‌నుక ఇలాంటి వీడియోల‌ను చూసి న‌మ్మ‌కూడ‌ద‌ని స‌ద‌రు ఆశ్ర‌మ నిర్వాహ‌కులు తెలిపారు. అందువ‌ల్ల ఆ వీడియోను ఎడిట్ చేశార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక అది ఫేక్ అని నిర్దారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version