విలన్ పాత్ర‌లో న‌టించాలి.. మ‌నసులో మాట చెప్పిన ప్రియ‌మ‌ణి

-

సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి త‌న సెంక‌డ్ ఇన్నింగ్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హింది ఇలా అన్ని భాషల‌లో సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. అంతే కాకుండా వెబ్ సిరీస్ ల‌లో కూడా ప్రియమ‌ణి మెరుస్తున్నారు. తాజా గా భామా క‌లాపం అనే సినిమా ప్ర‌ముఖ‌ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహా లో విడుద‌ల అయింది. కాగ ఈ సినిమా గురించి మాట్లాడుతూ గృహిణీ పాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌లేద‌ని.. అందుకే ఈ సినిమా చేశాన‌ని అన్నారు.

అలాగే న‌టిగా త‌ను ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల‌ని అన్నారు. త‌న‌కు ప‌వర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించాల‌నే కోరికా ఉంద‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పింది. న‌ట‌న విషయంలో త‌న ఆక‌లి ఇంకా తీర‌లేద‌ని అన్నారు. కాగ ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం తెలుగు లో విరాట ప‌ర్వం సినిమా చేసింది. అలాగే హిందిలో అజ‌య్ దేవ‌గ‌ణ్ తో మైదాన్, క‌న్న‌డ లో డాక్ట‌ర్ 56, త‌మిళంలో కొటేషన్ గ్యాంగ్ సినిమాలు చేస్తు బిజీ గా ఉంది. మూడు ఇండ‌స్ట్రీల‌ను క‌వ‌ర్ చేస్తుంది. అలాగే ఫ్యామలీ మ్యాన్ సిరీస్ లో 3 వ భాగం కూడా త్వ‌ర‌లో చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news