తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..వైద్య శాఖలో ఖాళీలను భర్తీకి ఆదేశాలు

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని దవాఖానలలో మందుల కొరత ఉండొద్దని.. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ మేరకు త్వరలో ఆ ఖాళీలనను భర్తీ చేస్తామని ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావు.

గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. ఫీవర్ ఆసుపత్రిలో 10.91 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌ రావు. అనంతరం 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ ల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫీవర్ హాస్పిటల్ లో మార్చురీ అభివృద్ధికి 60 లక్షలు మంజూరు. రూ. 50 లక్షలతో డయాలసిస్ వింగ్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లు కడుతున్నామని..త్వరలోనే అవి పూర్తి అవుతాయని మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news