40 కోట్ల యువతకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి !

-

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక యువతకు చేయూతను ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు చాలా పధకాలను యువత కోసం తీసుకురాగా , తాజాగా కేంద్ర ప్రభుత్వం “మై భారత్” ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ రోజు కాబినెట్ మీటింగ్ లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని ఆమోదాన్ని తెలపడం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాచారం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన మై భారత్ సంస్థను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మన దేశంలో 15 సంవత్సరాల నుండి 19 లోపు ఉన్న వారు 40 కోట్ల మంది వరకు ఉన్నారు. వీరి కోసమే ఈ మై భారత్ ను తీసుకువస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

యువత తీసుకునే చొరవ మరియు అవసరాల కోసం ఇది అడుగడుగునా తోడై ఉంటుందని మంత్రి భరోసాను ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి ? పనితీరు ? తదితర అంశాలు త్వరలోనే తెలియచేస్తామని మంత్రి చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news