నాకు ప్రాణ హాని ఉంది.. బీఆర్ఎస్ నేతపై ఫిర్యాదు చేసిన బాధితుడు..!

-

మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు ముడుచింతలపల్లి బీఆర్ఎస్ నాయకుడు ర్యాకల నీరజ్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉందని బుధవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు కొత్త బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త బాబు మాట్లాడుతూ.. మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ర్యాకల నీరజ్ గౌడ్ తనను కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని గత కొద్ది నెలలుగా వేధిస్తున్నాడని అన్నారు. ఇటీవల నేను హోటల్ సరుకుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళగానే, వ్యక్తి హోటల్ లో పని చేస్తున్న సిబ్బందిని బెదిరించి అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ హోటల్ షట్టర్ మూసివేసి రౌడీయిజం చేస్తూ రెచ్చిపోయాడని మండిపడ్డాడు.


మూడుచింతలపల్లి మండలానికి చెందిన 450 మంది ఉన్న పొలిటికల్ వాట్సాప్ గ్రూప్ లో కులం పేరుతో దూషిస్తూ నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నీరజ్ గౌడ్ కు మంత్రి మల్లారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో శామీర్ పేట పోలీస్ స్టేషన్ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం వల్ల నాపై కక్ష సాధించాలని ఈ విధంగా దూషిస్తూ దుస్సాహసానికి పాల్పడ్డాడని అన్నాడు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ కింద శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, నాకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు కొత్త బాబు హెచ్చరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news