కర్నాటక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా డీకే శివకుమార్ స్పందించారు. తాను పుట్టుకతో కాంగ్రెస్ వాదినని స్పష్టం చేశారు. తన రక్తం, లైఫ్ మొత్తం కాంగ్రెస్ కే అంకితం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఎలా పని చేస్తుందో.. విద్యా సంస్థలను ఎలా నడుపుతుందో తనకు తెలుసు అన్నారు. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పారు.
మరోవైపు కర్నాటక డిప్యూటీ డీకే శివకుమార్ తన రాజకీయ ప్రస్థానం పై మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించి ఆశ్చర్యపరిచారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే అని పాడటంతో బీజేపీ ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. కాగా డీకే శివకుమార్ యువకుడిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని సిద్దరామయ్య కు డీకే హింట్ ఇచ్చాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.