మనం ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి, బెడ్ రూమ్ చాలా ముఖ్యమైనది. బెడ్ రూమ్ ఎప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా మంచి కలర్స్ తో, డీసెంట్ గా ఉంటే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.మనం రోజు ఉపయోగించే కొన్ని వస్తువులే మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. వాస్తు శాస్త్రంతో పాటు ఆధునిక వైద్య నిపుణులు కూడా బెడ్రూంలో కొన్ని వస్తువులు తొలగించాలని సూచిస్తున్నారు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..
పాత దిండ్లు పరుపులు: మనం నిద్రించే పడకగదిలో పాత దిండ్లు, పరుపులు వలన దుమ్ము, చమట చర్మ కణాలు, బ్యాక్టీరియా డస్ట్ వంటి వాటికి నిలయాలుగా మారుతాయి. ఇవి ఎలర్జీలు, శ్వాస కోస సమస్యలు, చర్మ దద్దుర్లు, ఉబ్బసం వంటి వాటి కారణమవుతాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దిండ్లను, ప్రతి సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు, పరుపులను ఏడు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. ఇలా చేయడం వలన మనకి వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్ : మనం పడుకునే పడకగదిలో మంచి వాసన కోసం మనం వాడే రూమ్ స్ప్రై లలో ఫ్తాలేట్స్ (phthalates), బెంజీన్ (benzene) వంటి హానికరమైన రసాయనాలతో తయారుచేస్తారు ఇవి శ్వాస సమస్యలు, హార్మోన్లను ఇన్బాలన్స్ చేయడం, ఎలర్జీలకు దారితీస్తాయి వీటికి బదులుగా లావెండర్, పుదీనా వంటి సహజసిద్ద ఆయిల్స్ ని వాడడం మంచిది.

ఎలక్ట్రానిక్ వస్తువులు: బెడ్రూంలో టీవీలు, లాప్టాప్ లు మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ మన నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్రపోయే కనీసం ఒక అరగంట ముందు వీటిని ఆఫ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
పదునైన వస్తువులు : పడకగదిలో కత్తులు, కత్తెర్లు వంటి పదునైన వస్తువులను ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు వీటి వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు. వీటిని పడకగదికి దూరంగా ఉంచడం మంచిది. ఇక అంతేకాక పడకగదిలో నలుపు రంగు బెడ్ షీట్లు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. లైట్ కలర్ కంటికి చూడడానికి తేలికగా ఉండే రంగులను ఎంచుకోవాలి.
గజిబిజిగా ఉన్న ప్రదేశం: బెడ్ కింద పనికిరాని వస్తువులు పాత బట్టలు ఉంచడం ఈ రోజుల్లో అందరూ చేస్తున్న పనే, ఆలా పాత బట్టలు ఉంచడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గదిని ఎప్పుడూ శుభ్రంగా చిందర వందర లేకుండా ఉంచుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది.