మైనంపల్లి పై ఎమ్మెల్యే రజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. !

బీజేపీ కార్పొరేటర్ పై మైనంపల్లి హనుమంతరావు అనుచరుల దాడిని బిజెపి చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మైనంపల్లి వ్యవహారాన్ని బిజెపి నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సి మహిళపై దాడి చేయడాన్ని బిజెపి జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మైనంపల్లి అక్రమాలపై నివేదికలు కోరినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి అక్రమాలపై నివేదికలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా కేంద్రానికి బిజెపి పంపుతున్నట్టు తెలుస్తోంది. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను హిందీలో ట్రాన్స్లేట్ చేసి జాతీయ నాయకులకు పంపినట్టు సమాచారం.

Rajasingh

ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మైనంపల్లి హనుమంతరావు పై ఫైర్ అయ్యారు. మైనంపల్లి పిచ్చికుక్క మాదిరిగా అరుస్తున్నారు అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే మైనంపల్లి పై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని అన్నారు. ఇప్పుడు మైనంపల్లి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. మైనంపల్లి బిజెపిలో చేరడానికి బండి సంజయ్ చుట్టూ తిరిగిన మాట వాస్తవమేనని అన్నారు. ఇంటిలిజెంట్ రిపోర్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.