పవన్ సీఎం అభ్యర్ధి అయితే ఏంటి… కేయే పాల్ కూడా సీఎం అభ్యర్ధేగా !

-

తిరుపతి ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని వెంకట్రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరి ఎన్నికల్లో అక్కడి ప్రజలను మోసం చేయడం కోసం ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి మ్యానిఫెస్టోలో ప్రకటించిందని ఆయన అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వమంటే మాత్రం అది ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోందని అందుకే బీజేపీ ఒక పచ్చి మోసకారి పార్టీ అని ఆయన విమర్శించారు. పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిందని ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వలేని స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారో ఆమె సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఎలాంటి రౌడీయిజం చేస్తుందో అక్కడి ముఖ్యమంత్రి మమత దేశమంతా చాటి చెప్పారని ఆయన విమర్శించారు. ఇక బీజేపీ జనసేన కూటమి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం లో విశేషం ఏమీ లేదని పేర్కొన్న ఆయన గతంలో కె.ఏ.పాల్ కూడా తనకు తాను సీఎం అభ్యర్థిని అని ప్రకటించుకున్నారు అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news