అంతుచిక్కని రహస్యాలు.. సమాధానం దొరకని ప్రశ్నలు.. ఎందుకు అలా..అసలు ఎలా..?

-

కొన్ని కథలకు కారణాలు ఉండవు.. మిస్టరీగా మిగిలిపోవడం తప్ప. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కూడా అంతే. వీటని ఛేదించడానికి సైంటిస్టులు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ కారణాలు తెలుసుకోలేపోయారు. ఏమాత్రం టెక్నాలజీ తెలియని రోజుల్లో నీళ్లలో 5 అంతస్థుల భవనాలు ఎలా కట్టారు. వాటి మీద పరిశోధన చేసిన మేధావులు ఏకంగా ఇవి మనుషులు కట్టలేదని చెప్పారు. మనషులు కట్టకపోతే.. ఏలియన్స్ కట్టాయా..? ఇంకోటి.. అమెజాన్ అడవుల్లో డ్రాయింగ్స్..అసలు ఎవరు గీశారు అని కూడా కనుక్కోవాలని ప్రయత్నించారు.. అయినా దొరకలే..

యోనాగుని సబ్‌మెరైన్ శిథిలాలు :

1986లో డైవర్లు జపాన్ యోనాగుని దీవి దగ్గర్లోని సముద్రం లోపల విచిత్రమైన నిర్మాణాలను చూశారు. అవి నీటిలో ఏకంగా 5 అంతస్థుల ఎత్తులో ఉన్నాయి. రకరకాల శిల్పాలు, కళాఖండాలూ అక్కడ ఉన్నాయి. అంటే ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవారని అర్థమవుతోంది. సైంటిస్టులు మాత్రం… అవి మనుషులు నిర్మించినవి కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే.. అవి ప్రిగ్లేషియల్ నాగరికత కాలానివనీ… వాటిని నిర్మించేంత టెక్నాలజీ అప్పట్లో మనుషులకు లేదంటున్నారు. మరైతే వాటిని ఎవరు నిర్మించారు? గ్రహాంతరవాసులు నిర్మించారా? వాళ్లైతే సముద్రం లోపల ఎందుకు నిర్మించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు.. ఇప్పటికీ సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి.

అమెజాన్‌లో వింత ఆకారాలు

అమెజాన్ వర్షాధారిత అడవుల్లోని మైదానాల లాగా ఉండే చాలా ప్రాంతాల్లో… భూమిపై రకరకాల డ్రాయింగ్స్‌‌ను సైంటిస్టులు గుర్తించారు. అవి చాలా పెద్దవి. వాటిని జియోగ్లిఫ్స్ (geoglyphs) అంటారు… వాటిలో కొన్ని 3000 నుంచి 3500 ఏళ్ల నాటివి. వాటిని ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అప్పట్లో అంత పెద్ద బొమ్మల్ని అసలు ఎలా గీశారు? అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సమావేశాలు, చర్చలు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకే వాటిని గీశారనే వాదన కూడా ఉంది.. అదే పూర్తిగా నిజం అని చెప్పే వీలు కూడా లేదు. ఇలా ఈ విషయం ఇప్పటికీ.. ఓ మిస్టరీగా ఉంది.

అతనితో ఎక్కడ ఉంటే అక్కడ సీలింగ్ నుంచి వాటర్..

1983లో… అమెరికా… పెన్సిల్వేనియాలోని స్ట్రౌడ్స్‌బర్గ్‌లో డాన్ డెక్కర్ తాతగారు చనిపోయారు. అంత్యక్రియల తర్వాత డాన్‌కి జ్వరం వచ్చినట్లు అనిపించింది. ఇంటికి వెళ్లాక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో… ఆ ఇంటి సీలింగ్ నుంచి, హాల్‌లోని గోడల నీరు కింద రావటం గమనించారు. ఆ నీరు వచ్చిన ప్రదేశాల్లో ఎక్కడా వాటర్ పైపులు లేవు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. డాన్ ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చాక… అపస్మారక స్థితిలో ఉన్న డాన్‌ను దగ్గర్లోని పిజ్జా రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లాక.. ఇంట్లో నీరు రావడం ఆగిపోయింది.. కానీ… పిజ్జా రెస్టారెంట్‌లోకి డాన్‌ని తీసుకెళ్లగానే… అక్కడి సీలింగ్ నుంచి నీరు రావడం స్టాట్ అయింది. దాంతో… వెంటనే వాళ్లు డాన్‌ని పిజ్జా రెస్టారెంట్ నుంచి బయటకు తెచ్చారు. దాంతో నీరు రావడం ఆగింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు.

ఆండ్రూ కార్ల్‌సిన్

టైమ్ ట్రావెల్ కథలు చదివే వారికి.. 44 ఏళ్ల ఆండ్రూ కార్ల్‌సిన్‌ స్టోరీ కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా ఆశక్తి రేపుతుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నాడని… 2003 మార్చిలో అతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. అతను మొత్తం 126 రిస్కీ స్టాక్ ట్రేడింగ్స్ జరిపాడు… అన్నింట్లోనూ సక్సెస్ సాధించాడు.. స్టాక్ మార్కెట్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు. లాభం రావొచ్చు.. అప్పుడే నష్టం రావొచ్చు. కానీ అండ్రూ మాత్రం ఎప్పూడూ లాభాలే సాధిచండం. అప్పట్లో సంచలనం రేపింది. ఆండ్రూ జస్ట్ 50 వేల రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ, మళ్లీ కొంటూ…. ఇలా రెండు వారాల్లోనే 2వేల 275 కోట్ల రూపాయలు సంపాదించాడు. దాంతో… ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డాడంటూ అతన్ని 2003లో FBI అరెస్టు చేసింది. తాను 2256 సంవత్సరం నుంచి టైమ్ మెషిన్‌లో వెనక్కి వచ్చాననీ, అందువల్లే తాను షేర్లలో సక్సెస్ అయ్యానని తెలిపాడు. తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయాడు.

ఇలాంటి మరన్నీ ఇంట్రస్టింగ్ మిస్టరీలు ఇంకా ఉన్నాయి.. వాటి గురించి మళ్లీ మాట్లాడుకుందాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version