ఒక్కసారిగా నేలరాలిన వందల పక్షులు.. వీడియో వైరల్.. రీజన్ సస్పెన్స్..!

-

అంతుచిక్కనవి రహస్యాలుగా..సమాధానం లేనివి మిస్టరీలుగా ఈరోజుకు ఎన్నో మిగిలిపోతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ గురించే ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ అమెరికా దేశం మెక్సికోలో జరిగింది ఈ ఘటన… అక్కడ వందల పక్షులు ఒక్కసారిగా నేలకూలి చనిపోయాయి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెక్సికో పోలీసులు ఆ సెక్యూరిటీ ఫుటేజ్ వీడియోని రిలీజ్ చేశారు.

ఓ వీధిలో పసుపు రంగు తల ఉండే బ్లాక్ బర్డ్స్ ఒక్కసారిగా గుంపుగా వచ్చాయి. వేల సంఖ్యలో వచ్చిన పక్షుల్లో వందల పక్షులు నేలరాలి చనిపోయాయి. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ముందు పక్షులన్నీ నేలపై పడగా.. వాటిలో కొన్ని ఎగిరిపోయాయి. మరికొన్ని చనిపోయాయి. ఇది మెక్సికోలోని చిహువాహువాలో (Chihuahua) జరిగింది. ఆ వీధిలో ఎక్కడ చూసినా చనిపోయిన పక్షులే. ఈ ఘటన తర్వాత పక్షుల్ని పరిశీలించే బృందానికి కాల్ చేశారు.

ఈ బ్లాక్ బర్డ్స్.. సాధారణంగా శీతాకాలంలో.. ఉత్తర అమెరికా పక్కనే ఉండే కెనడా నుంచి దక్షిణ అమెరికావైపు వస్తుంటాయట. అవి చనిపోవడానికి కారణం ఏంటి అన్నది పరిశీలిస్తుంటే.. ఘటనకు దగ్గర్లోనే ఉన్న ఓ హీటర్ నుంచి విషపూరితమైన పొగ రావడమే కారణమని అనధికారిక రిపోర్టులు చెబుతున్నాయి. పవర్ లైన్ కి తగలడం వల్ల కూడా అవి చనిపోయి ఉండొచ్చని కొందరు అంటున్నారు. కానీ కచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు.

వారంలో రెండో ఘటన:

ఫిబ్రవరి 10న వేల్స్ లోని… వాటెర్స్‌టన్, హాజెల్ బీచ్ మధ్య ఆకాశం నుంచి పడి వందల పక్షులు చనిపోయాయి. అవి నేలని చేరకముందే చనిపోయాయనే అంచనా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం పక్షి ప్రేమికులకు బాధాకరమే.

అప్పుడు కూడా జరిగింది.

2019లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వేల్స్ లో జరిగింది. అప్పుడు కూడా వందల పక్షులు ఆకాశం నుంచి నేల రాలాయి. రోడ్డుపై పడి చనిపోయాయట. వందల సంఖ్యలో పక్షులు చనిపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. ఎవరికి తోచింది వారు అనేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news