హైదరాబాద్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం : నడ్డా

-

నిన్న సాయంత్రం తాజ్ బంజారాలో చేంజ్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. మేధావులు, ప్రముఖులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ముందున్నారని ఇక్కడ కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి సచివాలయం రాలేదు.. ఇప్పుడు సచివాలయంనే కూల్చేశారు, వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ ఏం చేస్తారు ? అని ఆయన ప్రశ్నించారు. నాయకుడు రాజుగా ఫీల్  కావద్దు..సేవకుడిగా ఉండాలని ఆయన అన్నారు.

మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఇచ్చారన్న ఆయన డబ్బులు ఇస్తే అవినీతి చేస్తారని అందుకే గౌరవంగా జీవించే అవకాశం అందరికీ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ లను ఏకం చేస్తా అంటున్నారని, దేశంలో మిగతా పార్టీల అందరిదీ ఒకే లక్ష్యం అవినీతి పెంచడం.. కుటుంబాలను బాగు చేసుకోవడం అని ఆయన అన్నారు.  బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తా అంటున్న కేసీఆర్ ఫ్యామిలీ పార్టీలతో కలిసి పెద్ద కుటుంబ పార్టీ చేస్తా అని చెబితే బాగుంటుందని అన్నారు. బీజేపీ కి అవకాశం ఇవ్వండి..ఉన్నత శిఖరాలకు  హైదరాబాద్ ను తీసుకెళ్తామని ఆయన అన్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version