రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఆకలి కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఇద్దరు విద్యార్థులు సైతం మరణించారు. అయినప్పటికీ హాస్టల్స్‌లో నాణ్యమైన భోజనం అందించడం లేదు. తాజాగా ఓ కాలేజీ మెస్‌లోని భోజనంలో కప్ప.. పురుగులు దర్శనమిచ్చాయి.
దీంతో కాలేజీ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన గుంటూరు – ఆచార్య నాగర్జున యూనివర్సిటీలోని మహిళల హాస్టల్లో వెలుగుచూసింది. రాత్రి భోజనం చేసే క్రమంలో సాంబారులో కప్ప, పెరుగులో పురుగులు వచ్చాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటన ఈ నెలలో రెండోసారి జరిగిందని.. ఆహారం విషయంలో కాలేజ్ ఛైర్మన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
కాలేజ్ హాస్టల్ సాంబార్లో కప్ప.. పెరుగులో పురుగులు..
ఆందోళనకు దిగిన విద్యార్థినులు
గుంటూరు – ఆచార్య నాగర్జున యూనివర్సిటీలోని మహిళల హాస్టల్లో సాంబార్లో కప్ప, రాత్రి భోజనంలో భాగంగా పెరుగులో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఈ నెలలో రెండోసారి… pic.twitter.com/Ho4HHQD7uy
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024