DJ టిల్లుతో నాగ‌చైత‌న్య మూవీ ?

-

ప్రస్తుతం ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమెషన్స్‌తో బిజీగా ఉన్నాడు అక్కినేని నాగ చైతన్య. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. బోడి బాలరాజు అనే పాత్రలో నటించాడు చైతూ. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు చైతన్య. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రచారం కోసం ముంబై వెళ్లిన చైతూను.. సినిమా కంటే సమంతతో విడాకుల గురించే ఎక్కువగా అడుగుతున్నారు. దాంతో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చైతూ.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు చైతన్య. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే పరుశురాంతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓటిటి కోసం ధూత అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ అక్కినేని హీరోకి ఓ కథ చెప్పారని.. అది చైకి బాగా నచ్చిందని టాక్. అయితే డిజే టిల్లు సీక్వెల్ నుంచి విమల్ సైడ్ అయినట్టు తెలుస్తోంది. దాంతో చైతూతో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా.. సమంత విషయంలో చైతన్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉన్నాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news