ఎన్టీఆర్ ను అలా చూడాలనుకున్న కృష్ణ.. కానీ చివరికి..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎంత మంచి గుర్తింపు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించడమే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల ద్వారా పెంచుకున్న ఇమేజ్ ను ఆయన రాజకీయంగా కూడా ఉపయోగించుకొని కేవలం 9 నెలల లోనే పార్టీ పెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇకపోతే ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈయనను ఆదర్శంగా తీసుకొని మరి ఎంతో మంది హీరోలు అరంగేట్రం చేశారు. ఇక అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరకు చేసిన మేలు ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ఎంతో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఈస్ట్ మన్ కలర్ ను తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం. అంతే కాదు హాలీవుడ్ రేంజ్ లో టక్కరి దొంగ, కౌబాయ్ వంటి పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణకు అల్లూరి సీతారామరాజు అంటే ఎప్పటి నుంచో అభిమానం. ఇక ఇదే పాత్రను ఎన్టీఆర్ చేస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎన్టీఆర్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్ర ఎలా చేయాలని చాలా ఆసక్తిగా ఉండడమే కాకుండా ఎన్నోసార్లు మీడియాతో వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కృష్ణ , ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తారని చాలా ఆశపెట్టుకున్నారట .కానీ ఎన్టీఆర్ చేయకపోవడంతో చివరికి తానే అల్లూరి సీతారామరాజు పాత్ర వేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు . ఇక తర్వాత ఎన్టీఆర్ తన కోరికను చంపుకోలేక చివరికి సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో చిన్న పాత్రలో అల్లూరి సీతారామరాజు పాత్ర వేసి తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరించారని చెప్పవచ్చు. ఇక అలా ఎన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజు పాత్రలో చూడాలనుకున్న కృష్ణ చివరికి ఆ పాత్రను తానే వేసి ప్రేక్షకులను అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news