థ్యాంక్యూతో నాగచైతన్య సరికొత్త ప్రయోగం.. మూడు గెటప్పుల్లో..?

-

మజిలీ సినిమాతో మాంచి హిట్ కొట్టిన నాగ చైతన్య, ఆ తర్వాత వెంకీమామా చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతుంది. ఐతే ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా స్టార్ట్ చేసాడు.

వచ్చే సంవత్సరం చిత్రీకరణకి వెళ్ళనున్న ఈ సినిమా నుండి ఆసక్తికరమైన అంశం బయటకి వచ్చింది. థ్యాంక్యూ సినిమాలో నాగ చైతన్య మూడు గెటప్పుల్లో కనిపిస్తాడట. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తే, మరో పాత్రలో అప్పుడే అమెరికా నుండి వచ్చిన ఎన్ ఆర్ ఐ లా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఈ రెండింటి కంటే డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఐతే ఇప్పటివరకూ ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయని నాగ చైతన్య మొదటి సారిగా ముడు రకాల గెటప్పుల్లో కనిపిస్తుండడం ఆసక్తికరమే. మరి ఆ పాత్రల్లో ప్రేక్షకులని మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news